Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకీడు
మండలంలోని వివిధ అభివద్ధి పనులకు రూ.8 లక్షలు మంజూరైన ట్టు జెడ్పీటీసీ మాలోతు బుజ్జి మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాన్‌పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కాల్మెట్ తండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4 లక్షలు, పాలకీడు, బొత్తలపాలెం, జానపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొనుగోలు కోసం రూ.రెండున్నర లక్షలు మంజూరైన ట్టు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నామమాత్రంగానే నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం జిల్లా పరిషత్‌లకు రూ.కోటి నిధులు మంజూరయ్యేవని పేర్కొన్నారు.