Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలోని 332 సర్వేనెంబర్ లో 75 ఎకరాల 33 గుంటల ప్రభుత్వ భూమి 93 కుటుంబాల దళిత రైతులకు వెంటనే పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. జహంగీర్్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను జహంగీర్ ప్రారంభించి మాట్లాడారు. నూతన మండలంగా ఏర్పడి ఏడేండ్లు గడిచినా మండలంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. మండలంలోని పిట్టలగూడెంలో ప్రజలు చనిపోతే కనీసం బొంద పెట్టడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయం పై అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు శ్మశాన వాటిక స్థలం కేటాయించక పోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రేషన్, పింఛన్లు తెచ్చుకోవడం కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాడ గ్రామానికి వెళ్లి రావడం వల్ల వద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పిట్టల గూడెం గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించి.రేషన్ షాప్ను ఏర్పాటు చేయాలని ,రోడ్డు మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.మనపల్లి వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని , కాటేపల్లి గ్రామం నుండి కొండాపురం గ్రామం వరకు బీటీ డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో కలెక్టరేట్ దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీక్ష శిబిరానికి స్థానిక తహసీల్దార్ రాము వచ్చి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జయరాములు మండల కమిటీ సభ్యులు రోమన్ సర్వయ్య గోపాల్ మల్లేశం, మాటూరు మాజీ సర్పంచ్ భైరాపాక యాదయ్య ,. యిస్తారి. శంకరయ్య, సత్తమ్మ, గోపాల్ ,మల్లేశం ,విజరు, అంజమ్మ ,రామ్ చందర్, స్వామి, అనసూర్య ,యాకోబు ,సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.