Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాలని , అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా సమావేశానికి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆలేరు జెడ్పీటీసీ, జెడ్పీఫ్లోర్లీడర్ డాక్టర్.కె నగేష్ సమావేశం దష్టికి తీసుకురాగా, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మతి చెందిన రైతులకు రైతు బీమా అందించడంలో నిర్లక్ష్యం విడనాడాలని జెడ్పీచైర్మెన్ అధికారులను ఆదేశించారు. గుండాల మండలంలో కాల్వ కోసం భూసేకరణ జరిగిన రైతులకు నష్టపరిహారం అందుతుందని, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లరతో ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర వెంటనే తూకం వేసి తరలించి మిల్లులో చేరేలా చేసి, లారీలో ధాన్యం అన్లోడ్ చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కరోనా వ్యాక్సినే మొదటి డోస్ 80శాతం, రెండవ డోసు 44శాతం పూర్తి కావడంతో వైద్యాధికారులను అభినందించారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాల్ని విస్తతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో 1.62 లక్షల డోసులు నిల్వ ఉన్నాయని వైద్యులు తెలిపారు. భువనగిరి ఏరియాస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే వారిని తిరస్కరిస్తున్నారని, సాధారణ ప్రసవాలు పెంచాలని వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి కష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డ్డి, భువనగిరి ఎంపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, బీబీనగర్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, చౌటుప్పల్ ఎంపీపీ వెంకటరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, జెడ్పీటీసీలు సుబ్బురు బీరు మల్లయ్య, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వాకిటి పద్మ, తోటకూర అనురాధ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.