Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్పీ నర్మద
నవతెలంగాణ-నల్లగొండ
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని ఏఎస్పీ ఏ.నర్మద అన్నారు.శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో పోలీస్అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్లైన్లో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.పోలీస్‌శాఖలో వినియో గించే ప్రతి ఆయుధం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్‌హౌస్ ప్రతిఏడాది నిర్వహిస్తున్నామన్నారు.అయితే పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాల వినియోగం, అవగాహన కోసం నేరుగా పోలీస్స్టేషన్లకు, జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించడం జరుగుతుందని కానీ ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు వివరించారు.ప్రజల రక్షణ, ప్రజాసేవ కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలను మరువలేమన్నారు.వారు ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉంటారన్నారు.అలాంటి త్యాగధనులు మన మధ్య లేకపోయినా వారి త్యాగాలను స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాన్ని కాపాడుకోవడం, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.పోలీసులు విధుల్లో భాగంగా కుటుంబానికి, పండగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజసేవ చేస్తారన్నారు.ప్రజారక్షణ కోసం ప్రాణాలను సైతం తణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. శాంతి భద్రతల పరి రక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత ప్రజల రక్షణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్‌వ్యవస్థ చాలా కీలకంగా పని చేసిందన్నారు.రక్షణ అంటే గుర్తువచ్చేది పోలీస్ అని అలాంటి పోలీసు విధినిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నదన్నారు. ఓపెన్‌హౌస్ సందర్భంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం, క్లూస్ టీములతో పాటు పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం, ట్రాఫిక్‌పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి, నకిలీ నోట్లు కనిపెట్టడం, దొంగతనాలు జరిగినప్పుడు ఆనవాళ్లు గుర్తించే విధానాలపై అవహగన కల్పించారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21 నుండి 31 తేదీ వరకు జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు, పోలీసులకు వ్యాసరచన పోటీలు, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం మేకింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సురేష్‌కుమార్, ఆర్ఐలు స్పర్జన్‌రాజ్, నర్సింహాచారి, శ్రీనివాస్, కష్ణారావు, నర్సింహ, ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, ఆర్ ఎస్ఐ. రాహుల్, సోమయ్య, నర్సి ంహ, రియాజ్, వెంకన్న పాల్గొన్నారు.