Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు వెంటనే మంజూరు చేసి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ మండల ద్వితీయ మహాసభ నిర్వహించారు.పార్టీ జెండాను సీనియర్ నాయకులు వేములకొండ పుల్లయ్య ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల గిరిసాగర్ మండలం ఏర్పడి ఏండ్లవుతున్నా ఇప్పటివరకు సొంతభవనాలు లేక ప్రజలు, అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు పక్క సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఒకరికొకరు తీసిపోని విధంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారని, వాటిని ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.భవిష్యత్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటానికి పార్టీ మహాసభలు వేదికగా మారబో తున్నాయన్నారు. అనంతరం కన్వీనింగ్ కమిటీని ప్రకటించారు. మండలకన్వీనర్గా కొర్రా శంకర్‌నాయక్,కో కన్వీనర్‌గా జటావత్ రవినాయక్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బుర్రి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు సముద్రాల కష్ణయ్య, బుర్రి సైదయ్య, రమావత్ స్వామి, నల్లబెల్లి జగదీష్, కొర్రా అశోక్‌నాయక్, సపావట్ రమేశ్‌నాయక్, కొర్రా మంగ్తా, చరణ్ పాల్గొన్నారు.