Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ సేవాసదన్ జిల్లా సెక్రెటరీ జి.వేణు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ న్యాయంపొందలేమని భావనతో ఎవరు ఉండ కూడదని ఖర్చులేకుండా న్యాయం అందించడమే న్యాయ సేవాసదన్ లక్ష్యమని జిల్లా సెక్రెటరీ, జడ్జి జి.వేణు పేర్కొన్నారు.శుక్రవారం మండలకేంద్రంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం, రాజీపథకం,లోక్ అదాలత్, ఉచితన్యాయ సహాయంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం స్యాతంత్రం పొంది 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర ఫలాలను స్వేచ్ఛగా అనుభవించే విధంగా అందరికి న్యాయం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నా మన్నారు.1981లో న్యాయ సేవాసదన్ సంస్థ ఆవిర్భవించిందని చెప్పారు.రాజ్యాంగం ప్రకారం న్యాయం దష్టిలో అందరూ సమాను లేనన్నారు.ధనిక,పేద తారతమ్యం లేకుండా అందరికీ సమన్యాయం అందించడమే లక్ష్యమన్నారు. న్యాయంపై అవగాహన కల్పించేందుకు లీగల్ పారావాలంటీర్లకు 40 గంటలపాటు శిక్షణ ఇచ్చి గ్రామాల్లో వాలంటీర్లను నియమిం చామన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పల్నాటి శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రాజు, లేబర్ అధికారి రెహమత్ పాషా, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, లీగల్ పారావాలంటీర్లు యనమల భాస్కర్, మీలా శ్రవణ్, ఎండి మహమ్మద్అలీ, శ్రీశైలాచారి, అంగన్వాడీి టీచర్లు పాల్గొన్నారు.