Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నవంబర్ 17,18,19వ తేదీల్లో నిర్వహిం చనున్న సీపీఐ(ఎం) జిల్లా 20వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.శుక్రవారం కనగల్ మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు.17న నల్లగొండలో వేలాది మందితో ప్రజాప్రదర్శన, గొప్ప బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.సభకు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు.భారత ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని సంస్కరణలను, ప్రయివేటీకరణ విధానాలను వేగవంతం చేసిందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను, విద్యుత్ చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై భారాలు మోపిందన్నారు.వీటితో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలను పెంచడం, ఎల్ఐసీ, బ్యాంకింగ్, రైల్వే,విమానయానం, రోడ్లు, పోర్టులు నిట్టనిలువునా అమ్మేసిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో రుణమాప,˜ీ దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండు,్ల నిరుద్యోగ యువతకు ఉపాధి, కేజీ టు పీజీ ఉచితవిద్య అమలుకు నోచుకోలేదన్నారు.ఎన్నికలు రాగానే కొత్త పథకాలతో ఓట్లు వేయించుకొని అధికారంలో రావడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందులసైదులు, సహాయ కార్యదర్శి కాన్పులింగస్వామి, నాయకులు ఎండీ అక్రమ్, బ్రహ్మానందరెడ్డి, నెలకొందరాశి లింగయ్య, మారయ్య, కంబాల శివలీల, సుల్తానా, రాంబాబు, లింగయ్య పాల్గొన్నారు.