Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అడ్మిషన్ మార్పిడి చేసుకున్న విద్యార్థులకు వాళ్ళు ఉండే ప్రాంతంలో పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పించాలని,ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రయివేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 25 నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కరోనా నేపథ్యంలో హైదరాబాదులో ఫస్టియర్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు సెకండియర్ నల్లగొండిపాంతంలో అడ్మిషన్ మార్పిడి చేసుకున్నారన్నారు.ఇప్పుడు ఈ విద్యార్థులు ప్రతిరోజూ హైదరాబాద్‌కు వెళ్ళి పరీక్ష రాయాలంటే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.దీంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విద్యార్థుల గురించి ఆలోచించి వెంటనే అడ్మిషన్ మార్పిడి చేసుకున్న విద్యార్థులకు ఆయా ప్రాంతాలలో పరీక్షలు రాసుకొని వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, హాల్‌టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం ఉండాలంటూ ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని విద్యాశాఖ ఇంటర్నెట్ ద్వారా పొందిన హాల్‌టికెట్లు ఉంటే పరీక్షలకు అనుమతించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం డివిజన్ కార్యదర్శి బోగాటి సుకుమార్, కొండ సిద్ధార్థ్, శశి, శంకర్ ఉన్నారు.