Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
వలిగొండ: మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు, శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు సామూహిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయినా బునాదిగాని కాల్వ పూర్తి కాలేదన్నారు, గ్రామాల్లో లింకు రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు. వలిగొండ నుండి అరూరు గ్రామం నుండి మచ్చ గిరి గుట్ట వేముల కొండ వరకు బీటీి రోడ్డు గుంతల మయంగా మారి ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సంఘం కత్వం వద్ద బ్రిడ్జిని పునర్నిర్మించాలని, మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ చందర్, కమిటీ సభ్యులు మొగిలి పాక గోపాల్ కొండే కిష్టయ్య వాకిటి వెంకటరెడ్డి ముఖ చంద్రమౌళి పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ, వ్యకాస దొడ్డి బిక్షపతి, డీవైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి మధు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నాగరాజు నవీన్ తిరుమల్ రెడ్డి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : మండలంలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేసి, భూమిలేని పేదలందరికీ మూడెకరాల భూమి, పేదలందరికీ 150 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షల్లో కూర్చున్న ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహకు, కమిటీ సభ్యులకు పూల దండలు వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెేసీఆర్ ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి, 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు, అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, అన్నంపట్ల కష్ణ, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, మోటె ఎల్లయ్య, ముత్తి రెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కష్ణ, బస్వాపురం శాఖ సహాయ కార్యదర్శి చిక్కుల చంద్రమౌళి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు సివేరి ఎల్లయ్య, నాయకులు, ప్రజలు వడ్డెబోయిన వెంకటేష్, దయ్యాల మల్లేశం, మధ్య్ పురం బాల్ నరసింహ, ఉడుత వెంకటేష్, సింగారం పెంటయ్య, కాసారం మల్లయ్య, సింగారం జహంగీర్, కసరబోయిన మల్లయ్య, రాగుల లక్ష్మయ్య, మూడుగుల ఉప్పలయ్య, బాల్ద మల్లయ్య, కొండ వెంకటయ్య, వంట లక్ష్మమ్మ లు పాల్గొన్నారు.
భువనగిరి : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు.దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యారన్నారు. పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలు వేలాదిగా ఉంటే కేవలం 560 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేశారన్నారు. రోడ్డు వెడల్పులో దుకాణాలు కోల్పోతున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, పట్టణ కార్యదర్శి మాయ కష్ణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, నాయకులు కొండ నాగభూషణం, వొల్దాస్ అంజయ్య, వనం యాదగిరి,బాశెట్టి శ్రీను,దొంతరబోయిన బాలమణి పాల్గొన్నారు
సంస్థాన్ నారాయణపురం: గుంతలు పడిన రోడ్లకు వెంటనేనిధులు మంజూరు చేసి పునర్ నిర్మాణం చేపటాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సి రెడ్డి కోరారు.శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన రిలే దీక్షల్లో ఆయన మాట్లాడారు. అర్హులైన వద్ధులకు,వితంతులకు, వికలాంగులకు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. గుడిమల్కాపూర్ నుండి చౌటుప్పల్, సర్వేలు,దేవిరెడ్డిగూడెం వరకు నారాయణపురం నుండి వాయిల్లపల్లి మీదుగా గట్టుప్పల్ వరకు ధ్వంసమైన రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. ఈ దీక్షలో జిల్లాకమిటీ సభ్యులు జి. శ్రీనివాసాచారి, దోంతగోని పెద్దలు, మండల శాఖ కార్యదర్శి దోడ యాదిరెడ్డి, కోంగరి మారయ్యా,సుధర్షణాచారి, కే. యాదవరెడ్డి, పంకర్ల యాదయ్యా తదితరులున్నారు.
మోత్కూరు: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా సుందరయ్య కాలనీ, ఎస్సీ కాలనీలు, పద్మశాలీ కాలనీ, డ్రైవర్ కాలనీల్లో సమస్యలు పరిష్కారం కాలేదని, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొండగడప నుంచి బుజిలాపురం, బుజిలాపురం నుంచి పాటిమట్ల వరకు బీటీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల, పట్టణ కార్యదర్శులు గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, పట్టణ మాజీ కార్యదర్శి కూరెళ్ల రాములు, నాయకులు చింతల కష్ణారెడ్డి, కందుకూరి నర్సింహ, రాచకొండ రాములమ్మ, చామకూర దశరథ, మాండ్ర చంద్రయ్య, గర్దాసు వెంకన్న, మహేశ్వరం నాగరాజు, సారగండ్ల శ్రవణకుమార్, కాశగాని నర్సయ్య, తాటి కరుణాకర్, వి.పద్మ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మండల పోలీస్ శాఖను వరంగల్ కమిషనరేట్ నుండి రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి మార్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన సామూహిక దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఐ కార్యాలయం రఘునాథపల్లి 50 కిలోమీటర్లు, డీసీపీి ఘన్పూర్ 65 కిలోమీటర్లు,ఏసీబీ జనగామ 32 కిలోమీటర్లు కమిషనర్ వరంగల్ ఆఫీస్‌కి వంద కిలో మీటర్లు తిరుగుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండల కేంద్రంలో ఇంటర్ డిగ్రీ కళాశాలలు, ఎస్సీ బాలుర వసతి గహం ఏర్పాటు చేయాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటలు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం),సీఐటీయూ మండల కార్యదర్శులు మద్దెపురం రాజు,పోతరబోయిన సత్యనారాయణ,్ట మండల కమిటీ ఖలీల్, మల్లెబోయిన బాలయ్య, కొలిచెలిమ అబ్బయ్య, గొల్లపల్లి సురేష్, కొయ్యేటి రాములు,అన్నెపర్తి నరసయ్య,ఎస్్ఎఫ్ఐ నాయకులు బుర్రు అనిల్ కుమార్,నత్తి సతీష్,బందెల సతీష్,గూడెపు వెంకటయ్య,సోమనర్సయ్య పాల్గొన్నారు.
ఆత్మకూర్ ఎం: అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వ నులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) మండల శాఖ కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను, పింఛన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రచ్చ గోవర్ధన్, రాచమల్ల సత్తయ్య, గుండెబోయిన స్వామి, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, నాయిని యాదిరెడ్డి, కందడి వెంకట్ రెడ్డి, భాష బోయిన ఐలయ్య, నార్కట్‌పల్లి ముత్తయ్య, పొన్నం రాజమల్లు, కూరెల్ల లక్ష్మణ్, మల్లెల శ్రీశైలం, జనక్కల బిక్షం, నాయిని పుల్లారెడ్డి ,ఎలగందుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, బూర్గు కష్ణారెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం సామూహిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వారు ప్రారంభించి మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఈ దీక్షల్లో ఆ పార్టీ మండలకార్యదర్శి గంగదేవి సైదులు, బోయ యాదయ్య, పిట్టల లక్ష్మయ్య, బుచ్చిరెడ్డి, లక్ష్మయ్య, కొండె శ్రీశైలం, ఇట్టబోయిన శేఖర్, ఎనబోయిన వెంకటేశ్, జక్కిడి బాల్‌రెడ్డి, ఎస్కె.మదార్, యాట నర్సింహా, జంగయ్య, ఆదిమూలం నందీశ్వర్, బద్దం లింగస్వామి, మీసాల శ్రీను, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, కిష్టయ్య, నర్సింహాచారి, సామిడి నాగరాజురెడ్డి, బోదాసు వెంకటేశ్ కూర్చున్నారు. దీక్షలకు జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, ఆకుల ధర్మయ్య, ఎర్ర ఊషయ్య, బొడ్డు అంజిరెడ్డి మద్ధతు తెలిపారు.
బీబీనగర్ : మండలంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని, బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇన్‌పేషెంట్ విభాగాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తయినప్పటికీ మండలంలో అర్హులైన ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. బీబీనగర్, కొండమడుగు, రాయరావుపేట గ్రామాల్లో ఇండ్లు మంజూరైనప్పటికీ నేటికీ పూర్తిచేయలేదన్నారు. మండలంలో రుద్రవెల్లి, జూలూరు, రావిపహడ్, అనాజిపురం వాగులపై నేటికీ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండలకార్యదర్శి బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, టంటం వెంకటేశ్, కందాడి దేవేందర్‌రెడ్డి, బండారు బాలనర్సింహా, సయ్యద్ ఉమర్, సందెల రాజేశ్, ఎల్లాంల సత్యనారాయణ, పొట్ట యాదమ్మ, జిట్టా మల్లారెడ్డి, మంద కిరణ్, ఎర్రోళ్ల రంజిత్, సిలివేరు కష్ణస్వామి, సురేశ్, శివ పాల్గొన్నారు.