Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కోటాచలం
నవతెలంగాణ - కోదాడరూరల్
అయోడిన్ లోపంతో అనేక వ్యాధులు వస్తాయని, ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కోటాచలం కోరారు. శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ఆవరణలో జాతీయ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అయోడిన్ లోపం దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందన్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నిరంజన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉప్పులోని అయెడిన్ ఆవిరి కాకుండా డబ్బాలను మూత పెట్టి ఉంచాలని సూచించారు. జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మనం రోజూ తినే ఆహారంలో అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా ఈ లోపాన్ని అధిగమించొచ్చన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర, డెమో అంజయ్య, సీడీపీవో అనంతలక్ష్మీ, జిల్లా ఆరోగ్య బోధకులు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ శైలజ, భాస్కర్‌రాజు, భూతరాజు సైదులు, సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.