Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
నవంబర్ 15న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పోతరాజు రజనిరాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ మూల అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ పాలేపు చంద్రశేఖర్, మున్సిపల్ అధ్యక్షులు తిరుమని యాదగిరి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు దూపటి రవీందర్, నారాయణరెడ్డి, సైదులు, సర్పంచుల ఫోరమ్ మండలాధ్యక్షులు కరుణాకర్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట్‌రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కందుకూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.