Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతగిరి
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వాఖ్యల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని టీఆర్ఎస్ మండలాధ్యక్షులు గింజుపల్లి రమేష్ అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలనూ అన్ని పార్టీల వారు అనుభవిస్తున్నారని తెలిపారు. దళితబంధు, దళిత బీమా, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ఉత్తమ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కొనతం ఉమా, మండల నాయకులు బుర్ర నర్సిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, కరిసే మోజేశ్, వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.