Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని నమత్పల్లి గ్రామంలో అభివద్ధి పనులను యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు.కోవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం చేరుకోవడంతో వైద్య సిబ్బందిని అభినందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో వాటిన మొక్కలు, పల్లెప్రకతివనం,పారిశుధ్య పనులు, రోడ్లు, ప్లాస్టిక్ వాడకం, స్వచ్ఛ సర్వేక్షన్, సమభావన సంఘాల పనితీరుపై గ్రూపు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వార్డులలో ఎలాంటి శుభ్రత లేకుండా చూసుకోవాలని, చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించి, నేరుగా డంపింగ్ యార్డుకు చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ ఏలముల శాలిని జంగయ్య యాదవ్, ఎంపీడీఓ నాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.