Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
యాసంగిలో పంట మార్పిడి చేయాలని ఏడీఏ లాల్ చంద్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన రైతు సవేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం గురించి రైతులకు వివరించారు. ఈ పద్ధతి ద్వారా రైతులు తమంతట తామే వ్యవసాయం చేసి పండించి, పంటను ఫౌండేషన్ సీడ్ ధ్వారా వచ్చే సర్టిఫైడ్ సీడ్‌ను తోటి రైతులకు సప్లై చేయవచ్చు అని చూసించారు. యాసంగిలో కచ్చితంగా రైతులు పంట మార్పిడి చేసి అపరాలు అయిన జొన్న, మినుము, పెసర, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వు లాంటి పంటలు ఎక్కువ మెత్తల్లో సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో అశ్వరావుపేట ఏడీఏ అఫ్జల్ భేగం, అన్నపురెడ్డిపల్లి మండల ఏవో అనూష, ఏఈఓ ప్రశాంత్, సంధ్యారాణి, సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ పర్స వెంకట్, రైతులు పాల్గొన్నారు.