Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
వివిధ దేశీ వరిరకాలను సాగు చేస్తున్న యువ రైతు క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించినట్టు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి బి. లవకుమార్ తెలిపారు.శనివారం మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన యువ రైతు యెలుగూరి సుదర్శన్ రెడ్డి సాగు చేస్తున్న వివిధ వరిరకాలను సందర్శించి రైతు పాటిస్తున్న సేంద్రియ విధానాలను పరిశీలించారు.మూడేండ్ల నుండి రైతు దేశీ వరిరకాలైన దూదేశ్వర్, కష్ణ హవిరక్తశాలి, జీరాపూల్ మొదలుగు వాటిని సాగు చేస్తున్నట్టు తెలిపారు.దూదేశ్వర్ వరి బియ్యం తెలుపు రంగులో ఉండి బాలింతల స్త్రీలకు పాల ఉత్పత్తికి తోడ్పడ్తాయన్నారు. తద్వారా పిల్లలకు రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు అధిక పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారన్నారు.రక్తశాలి రకం రైస్ ఎరుపురంగులో ఉంటుందన్నారు. అత్యంత పోషక విలువలు కలిగి 110 రోజుల్లో పంట వస్తుందన్నారు.జీరాపూల్ అనే ఇంకొక దేశీ వరి రకం చత్తీష్‌ఘడ్ అనేది రోజు వారి వాడకానికి బాగుంటుందన్నారు.సన్నగింజ రకం 135-140 రోజుల పంటకాలం అన్నారు.వీటి సాగు పూర్తిగా పోషకాలను అందించడానికి సహజ సేంద్రియ పద్ధతులైన ఘానా జీవామతం, ద్రవ జీవామతం,ల్యాబ్, ఫిష్ అమీనోఆసిడ్ మొదలగునవి వాడామన్నారు.తెగుళ్ల నివారణకు శొంఠి, పాలకషాయం, పుల్లటిమజ్జిగ, పేడమూత్రం ద్రావణం, పురుగల నివారణకు అగ్నిఅస్త్రం వాడామన్నారు.కేవీకే ద్వారా నిరంతరం సలహాలు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. దేశీ ఆవును కొనుగోలు చేసి పేడ మూత్రాన్ని సేకరించుకొని వరి పొలానికి వాడుతున్నట్లు తెలిపారు.ఈ పర్యటనలో లయోలా కళాశాల వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు ఉదరుకిరణ్, హరీష్, ఆరోన్ ఫ్రాన్సిస్‌లతో పాటు రైతు మల్గిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.