Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 54 మోటార్‌సైకిళ్లు, నాలుగు ఆటోలు సీజ్
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలోని సీతారాంనగర్ కాలనీలో శనివారం ఉదయం కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. 54 మోటారు సైకిళ్లను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.ఎంవీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ రఘు మాట్లాడుతూ 11 సెర్చ్ పార్టీలతో ఈ ఆపరేషన్ నిర్వహిం చామన్నారు.యువతపై గంజాయి, మాదకద్రవ్యాల ప్రభావం, సైబర్‌నేరాలు, వాటిపై అవగాహన, ఓటీపీ ప్రాడ్ మహిళలపై జరిగే నేరాలపై యువతకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నలుగురు సీఐలు, 17 మంది ఎస్సైలు, ఎస్సై కట్ట వెంకట్‌రెడ్డి, 150 మంది కానిస్టేబుళ్లు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.