Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ గ్యాస్,నిత్యావసర వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు.శనివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహరెడ్డి భవన్లో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.కేంద్రం తీసుకొచ్చిన నల్లాచట్టాలను రద్దు చేయాలని, వరికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారుచెరుకు సత్యం అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మేకనబోయిన శేఖర్,మందడి రాంరెడ్డి, కొప్పుల రజిత, మేకనబోయిన సైదమ్మ, మామడి మరియమ్మ, రెడ్డి మోహన్‌రెడ్డి, పందిరి సత్యనారాయణ రెడ్డి, బోళ్ళ నాగేందర్‌రెడ్డి, నల్లమేకల అంజయ్య, చిట్లేకి యాదగిరి, నారాయణ,వీరారెడ్డి, ధనమూర్తి, సీతారాములు, పొదిల్ల అంజయ్య, జంగం సత్తయ్య, కామళ్ళ లింగయ్య పాల్గొన్నారు.