Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబసభ్యులకు రూ.55వేల నష్టపరిహారం
నవతెలంగాణ-చివ్వెంల
అనుమానాస్పదస్థితిలో గిరిజన మహిళ మతి చెందిన ఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతన్ కూడి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలపరిధిలోని జయరాంగుడితండాకు చెందిన గుగులోతు కలమ్మ (45) కూలీ పనుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతన్కూడి గ్రామానికి తండాలోని మరో ముగ్గురితో కలిసి వెళ్ళింది.రోజు మాదిరిగానే కూలి పనులకు వెళ్లిన కలమ్మ, ఉదయం గ్రామంలో పత్తి ఏరుతుండగా ఆ సమయంలో చాతి నొప్పి వచ్చి కొద్దిసేపు అస్వస్థతకు గురైంది.చాతిలో నొప్పి ఎక్కువ కావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.అక్కడి నుండి హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.కానీ కలమ్మ గుండెనొప్పితో కాకుండా మరే ఇతర కారణాలతో మతి చెందిందని మతురాలి కొడుకు, కూతురు ఆరోపిస్తూ,కూలీలను తీసుకెళ్లిన తండాకు చెందిన బండావత్ సేవ్ల ఇంటి ముందు కలమ్మ మతదేహాంతో ఆందోళనకు దిగారు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతురాలి కుటుంబ సభ్యులకు రూ.55 వేల నష్టపరిహారం కల్పించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు.