Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
- సీపీిఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ -రామన్నపేట
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎంతో చరిత్ర ఉన్న పాత శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన రామన్నపేట మండలం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ పార్టీ ఆద్వర్యంలో శనివారం స్థానిక తహసీల్థార్ కార్యాలయం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత దశాబ్దాల కాలంగా మండలంలో ప్రజాసమస్యలు పేరుకుపోయినా పాలక ప ప్రభుత్వాలకు సోయిలేకుండా పోయిందని విమర్శించారు. చిన్న నీటి పారుదల వనరులైన ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలలో భూములు కోల్పోయిన రైతులకు రెండు దశాబ్దాలు కావస్తున్నా పూర్తి పరిహారం అందలేదన్నారు. కాల్వ తవ్వకం కూడా పూర్తి కాలేదన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సమస్యలకు నిలయంగా మారిందన్నారు. కనీస సదుపాయాలు లేక ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాల్వలు, పంటలు ధ్వంసమైనా కనీసం పర్యవేక్షణకు కూడా పాలకులు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. అంతర్గత లింకు రోడ్ల నిర్మాణంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలంలో 1500 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేండ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు.. ప్రజల సమస్యలను గాలికొదిలి ప్రచారాలకే పరిమితమవు తున్నారన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. శిధిలావస్థకు చేరిన అసీఫ్ నహర్ కాల్వను మరమత్తులు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండలంలో ప్రజా సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 25న పెద్దఏత్తున తహసీర్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, గాదె నరేందర్, యాదాసు యాదయ్య, మీర్ ఖాజా అలి, మామిడి వెంకట్ రెడ్డి, కందుల హనుమంతు, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, ఎం.డి రషీద్, వనం ఉపేందర్, మేడి గణేష్, గంటెపాక శివ కుమార్, పిట్టల శ్రీనివాస్, వేముల సైదులు, మెట్టు శ్రవణ్, అంబటి సురేందర్ రెడ్డి, శానగొండ వెంకటేశ్వర్లు, ఆనగంటి నగేష్, బండ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.