Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎన్ఏ ఉన్న షర్మిల తెలంగాణ ఆడబిడ్డ ఎలా అవుతారు
- విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీి అధ్యక్షుడు బండి సంజరుల పాదయాత్రలు తెలంగాణపై పై దొంగ ప్రేమలు చూపుతున్నారని శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేక.. ఓర్వలేక, కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతూ పాదయాత్రలు చేస్తున్నాయని ఇది దురదష్టకరం అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ంలో తెలంగాణ ప్రాంతా న్ని నిలువు దోపిడీ చేసిన వారు.. ఇవ్వాళ మారు పేర్లతో, దొంగ ప్రేమతో మళ్ళీ తెలంగాణను దోచుకోవాలని తమ నాటకాలను ప్రారంభించారన్నారు. డీఎన్ఏ ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణా ఆడబిడ్డ ఎలా అవుతారని ఆమె పాదయాత్ర ఎందుకో ఎవ్వరికీ అర్థం కావడం లేదని తెలిపారు. కుటుంబ పాలన అంటూ షర్మిల ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ లో, తెలంగాణలో పెత్తనం కోసం షర్మిల పాదయాత్ర చేస్తున్నది. దోచుకోవాలన్నదే ఆమె అసలు ఉద్దేశమని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఎన్ని కుట్రలు చేసిన టీఆర్ఎస్దే విజయమని జోస్యం చెప్పారు. బీజేపీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని కుటిల యత్నాలు, కుట్రలు చేస్తున్నదని చివరకు ఘర్షణలు ప్రేరేపించేలా బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో కూడా ఇలానే కుటిల యత్నం చేసి బీజేపీ బొక్కా బోర్లా పడ్డదని తెలంగాణలో కూడా బీజేపీ పప్పులు ఉడకవని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదని బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన దుయ బట్టారు. ఇంధన ధరలు భగ్గుమంటు నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయనారు. బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవు. తెలంగాణ ను అతలాకుతం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేతులెత్తేసినా ఈ వానాకాలం ధాన్యాం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటున్నదని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనం అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడ, దేవరకొండ, నియోజకవర్గలాల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ లిఫ్ట్ లను మంజూరు చేశారని దీనికి శుక్రవారమే టెండర్లు కూడా పిలిచారని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లొర్ లీడర్, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.