Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- ఆలేరురూరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యారని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మోటకొండూరు మండల కేంద్రంలోని టీఆర్ఎస్ విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ నెల 25న హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ, నవంబర్ 15 న వరంగల్ లో జరగనున్న తెలంగాణ విజయగర్జన సభ సన్నాహాలపై గ్రామాల వారిగా వరుస సమావేశాలకు హాజరుకావాలన్నారు. ఈ సభకు ప్రతి గ్రామం నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, సింగిల్ విండోవైస్ చైర్మెన్ అంజి రెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల జహంగీర్, సెక్రెటరీ జనరల్ ఎర్ర మల్లేష్ ,యూత్ విభాగం అధ్యక్షుడు కష్ణరాజు, తదితరులు పాల్గొన్నారు.