Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్దిరాల: వరి పంటకు సుడిదోమ,కంకినల్లి తెగుళ్లకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసు కోవాలని మండల వ్యవసాయఅధికారి డి.వెంక టేశ్వర్లు సూచించారు.శనివారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో పలువురి రైతుల వరి పంటలను పరిశీలించి మాట్లాడారు.వరి పంటలో సుడిదోమ, కంకినల్లి సోకినట్టు గుర్తించామన్నారు.తద్వారా పిల్ల, పెద్ద దోమలు నీటి పైభాగంలో దుబ్బుల దగ్గర ఉండి రసం పీల్చటం వల్ల పైరు లేతపసుపు వర్ణానికి మారుతుందన్నారు.పైరు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపో తుంటుందన్నారు. పొలంలో నీరు ఎక్కువగా నిలవ ఉన్నప్పుడూ అధిక నత్రజని వాడకం,కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను వాడినపుడు ఈ పురుగు ఉధతి ఎక్కువ అవుతుందన్నారు.ఈనిక దశల్లో దుబ్బుకు 20-25 దోమలు గమనించిన వెంటనే సస్య రక్షణ చర్యలు చేపట్టాల న్నారు.తొలిదశలో ఎస్ఫేట్ 75 ఎస్పీ1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.ఉధతి ఎక్కువ ఉంటే డైనోటేఫ్యూరన్ 80 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120 గ్రాములు లేదా ఎథిప్రోల్ంఇమిడాక్లోప్రిడ్ 50 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయాలన్నారు.కంకినల్లి ఆకుల మధ్య ఈనెపై లేదా ఆకుమట్ట లేదా కాండం మీద గోధుమ నుండి నల్లటి మచ్చలు, వెన్నులు వంకరతిరగడం లేదా పాక్షికంగా బయటికి రావడం, గింజ తయారీదశలో గింజల మీద గోధుమ లేదా నల్లమచ్చలు ఏర్పడ తాయ న్నారు.దీని నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమేసిఫెన్ 1 మిల్లీలీటర్లు రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎండీ ఆఫ్రీన్, రైతులు మూరగుండ్ల శ్రీనివాస్, మూరగుండ్ల సోమయ్య, వెంకటరాములు, నర్సింగ కొమరయ్య పాల్గొన్నారు.