Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
చట్టాలపై ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్ ఎఎన్.మూర్తి అన్నారు. ఆజాదీ కా అమత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. కళాశాల స్థాయిలో యువత ఏమాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్‌లో జీవితం అంధకారంగా మరే అవకాశం లేకపోలేదన్నారు. మహిళల పట్ల సోదరభావంతో మెలుగుతూ సాధ్యమైన సహకారాన్ని అందించాలన్నారు. ప్రజలందరికీ న్యాయాన్ని అందించే గురుతర బాధ్యత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయమూర్తులపై పెట్టారన్నారు కాలేజీలో రాగింగ్ చేస్తే జరిగే పర్యవసానాలపై విద్యార్థులకు వివరించారు.అనంతరం పలువురు న్యాయవాదులు సమాచార హక్కు చట్టం, మోటారు వాహనచట్టం, యాంటీ ర్యాగింగ్ చట్టం, బాల్య వివాహాల చట్టం, బాలలహక్కుల చట్టం వంటి చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో మండలా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మెన్ కోదాడ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యామ్‌సుందర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవబత్తిని నాగార్జున, ప్రధానకార్యదర్శి నాళం రాజన్న, వాగ్దేవి విద్యా సంస్థల చైర్మెన్ బాణాల వసంత వెంకట్ రెడ్డి, త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీను,వాగ్దేవి డే స్కాలర్ ప్రిన్సిపాల్ మండవ మధు, పట్టణ ఎస్ఐ రాంబాబు, సీనియర్ న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, ఎస్ఆర్కె మూర్తి, కోటిరెడ్డి,ముల్క వెంకట్‌రెడ్డి, గట్ల నర్సింహా రావు,రామిరెడ్డి, సిలివేరు వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, ఈదుల కష్ణయ్య, మిరియాల మంగయ్య, మోష, హనుమంతరాజు, ఉయ్యాల నర్సయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయసేవల పట్ల అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: న్యాయసేవల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిం ఉండాలని సూర్యాపేట రెండవ అదనపు జిల్లా జడ్జి ప్రశాంతి అన్నారు.శనివారం మండల ప్రజాపరిషత్ కార్యాలొయలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో న్యాయసేవలపై చివ్వెంల సర్పంచ్ జూలకంటి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ అనేక న్యాయపరమైన,కోర్టులకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.సెక్షన్498(A), గహహింస,ఫోక్సో, మోటార్ వెహికిల్ తదితర చట్టాలపై వివరించారు.చట్టాలపై అవగాహన లేకుండా కొన్ని పొరపాట్లు చేసి చట్టంచేతికి నేరస్తులుగా చిక్కకూడదన్నారు.18 ఏండ్ల లోపు పిల్లలకు వాహనాలను నడిపేందుకు ఇవ్వొద్దన్నారు. గహహింస చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలుగు వారు జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు అక్టోబరు 2 నుండి నవంబర్ 14 వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపడ్తామన్నారు. అడ్వకేట్ మారపంగు వెంకన్న వినియోగదారుల హక్కుల కు సంబంధించిన చట్టం గురించి వినియోగదారుల ఫోరం గురించి వివరించారు. ఎంపీపీ ధరావత్ కుమారి బాబునాయక్ మాట్లాడుతూ తమ మండలంలో న్యాయవ్యవస్థ పట్ల చట్టాల పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు, ఇన్చార్జి ఎంపీడీఓ గోపి, ఎస్సై కీర్తి, పీహెచ్సీ ఎంఓ డాక్టర్ రాజ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ నందిని,సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌నాయుడు, జ్యోతి, ఏపీఓనాగయ్య, ఆర్ఐ రామారావు, ఐసీడీఎస్ సూపర్వైజరు పద్మశ్రీ, గుద్దేటి వెంకన్న, జంపాల వెంకన్న, కళాకారులు లచ్చీరాంనాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.