Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
మండలంలోనినేరెడ గ్రామంలో దుబ్బాక వెంకట్రామ్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన వాటర్ ప్లాంట్ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి శనివారం ప్రారంభించారు. సొంత నిధులతో రూ.4లక్షలతో శంకుస్థాపన చేసి పది రోజులలో వాటర్ ప్లాంట్ నిర్మించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రజినీకాంత్ రెడ్డి ,మాజీ వార్డు సభ్యులు మిర్యాల నరేష్ నేత,వడ్డె పెల్లి చైతన్య, వడ్డేగాని నర్సింహ, సిరాగోని కష్ణయ్య వడ్డెపెల్లి అంజయ్య, వడ్డెపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.