Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఈ నెల 25న నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీని, నవంబర్15న జరిగే వరంగల్ విజయగర్జన సభను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన టీిఆర్‌ఎస్ విసత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు..దేశంలో ఉన్న రాష్ట్రాలన్ని తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయని 460 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సీఎం సహయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలోమండల అధ్యక్షులు ఎండి.ఖలీల్, ఎంపిపీ తాండ్ర అమరావతి శోభన్,జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,ఎంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి, గార్లపాటి సోమిరెడ్డి, గడ్డమీది పాండరి గౌడ్,మండడి రామకష్ణారెడ్డి,సంగి వేణుగోపాల్,రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ఎం: టీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం భవిష్యత్తులో ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్లో నిర్వహించిన టీిఆర్‌ఎస్ పార్టీ మండల విస్తతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించే విజయోత్సవ మహాగర్జనకు ప్రతి కార్యకర్త తరలి రావాలని కోరారు. ఈనెల 27న నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీసీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బిసు చందర్ గౌడ్ సర్పంచులు గనగాని మాధవి మల్లేశం గౌడ్, ఏనుగు తల ప్రమీల, లగాని రమేష్, కోల సత్తయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.