Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పెరుగుతున్న వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా మున్సిపల్ కేంద్రంలో శనివారం మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహంకాళి రాజేశ్‌ఖన్నా ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, నాయకులు పాల్వాయి జితేందర్‌రెడ్డి, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, బక్క శ్రీనాథ్, మొగుదాల రమేశ్‌గౌడ్, కొయ్యడ సైదులుగౌడ్, ఉబ్బు వెంకటయ్య, సుర్వి నర్సింహాగౌడ్, పెద్దగోని రమేశ్‌గౌడ్, బెడదం లింగస్వామి, తొర్పునూరి శ్రీకాంత్, దిలీప్, దయాకర్, విక్రమ్, సాయి, గణేశ్ పాల్గొన్నారు.
భువనగిరి టౌన్ : పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కట్టెల పొయ్యి తో వంట వార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ , మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జాంగిర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్ ఈరాపాక నర్సింహ, పచ్చల జగన్ ప్రదీప్ యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ యనగండ్ల సుధాకర్ ,మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.