Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
మండలంలోని జుబ్లక్ పల్లి , పోచంపల్లి పట్టణ కేంద్రంలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లనుపేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్కరికి కూడా డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీచేయలేదన్నారు. నెల రోజులలో ఇండ్లు పంపిణీ చేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలను సమీకరించి ఆ ఇండ్లను పంపిణీచేస్తామన్నారు. మండలం, పట్టణంలో కొనసాగుతున్న భూపంపిణీ నిషేధం ఎత్తివేసి ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న పేదలందరికీ నూతన పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి, పట్టణ కార్యదర్శి కోడె బాల్ నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొట రామచంద్రారెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి, మంచాల మధు, మండల కమిటీ సభ్యులు మన్నె రాజశేఖరరెడ్డి,పట్టణ కమిటీ సభ్యులు పగడాల శివ, గూడూరు రాంరెడ్డి, బుగ్గ లక్ష్మయ్య, దుబ్బాక జగన్, రామస్వామి అనిల్ రెడ్డి తో పాటు అందెల యాదగిరి, గంగాదేవి కష్ణ,నూకల నర్సింహ, గంగాదేవి పర్వతాలు, ఉపెందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పట్టణ అభివద్ధికి రూ.100 కోట్లు కేటాయించి పెండింగ్ లో ఉన్న రోడ్లు-డ్రైనేజీ సమస్యలు పూర్తిచేయాలని గతంలో ఎస్సీ-ఎస్టీ- బీసీ-మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు.సిపియం పట్టణ కార్యదర్శి మాయ కష్ణ. వెల్దాస్ అంజయ్య, బందెల ఎల్లయ్య, బర్ల వెంకటేశం, యాదగిరి,అంజయ్య,సంతోష్, కల్లూరి నాగమణి,గంధమల్ల బాలమణి, మాటూరి కవిత, ధనమ్మ, లక్ష్మి,అనుసుయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్: స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు శనివారం రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు పరిధిలో భూమిని కోల్పోయిన వారికి జీవో ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలకు జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ , ఏన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ సంఘీభావం తెలిపి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేష్, కొండ అశోక్ , పెంచికల్ పాడ్ సర్పంచ్ సిల్వెరు పుష్ప ఎల్లయ్య , మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య , అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి , శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు, కడారి రాజమల్లు, ఉడుత విష్ణు , వడేబోయిన వెంకటేష్, రావుల పోషయ్య, బొల్లెపల్లి క్రాంతి, ప్రణరు జానకి, బోసికే నర్సింహ, వెంకటేష్ లు పాల్గొన్నారు .
తుర్కపల్లి : సీఎం కేసీఆర్ ఫాం హౌస్ నుండి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్డులో భూములు,ఇండ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెేసీఆర్ పామ్ హౌస్ నుండి యాదగిరిగుట్టకు వేస్తున్న రోడ్డులో రైతులకు సమాచారం ఇవ్వకుండా గతంలో రోడ్డు వేశారని,ఇదేమిటని ప్రశ్నించిన తర్వాత నోటీసు ఇచ్చారని అది కూడా తప్పులతడకగా ఉందన్నారు. తక్షణమే అన్ని గ్రామాలలో రీ సర్వే చేయాలని, ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పల్లెపహాడ్ కొనుగోలు కేంద్రంలో అవినీతికి పాల్పడిన అధికారులు,పాలక వర్గం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షకు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశం గౌడ్, ఓయూ విద్యార్ధి జేఏసీ నాయకులు కర్ణాకర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్,నాయకులు కొక్కొండ లింగయ్య, తూటి వెంకటేశం, తలారి మాతయ్య, రాపోలు నర్సిరెడ్డి, ఆవుల కలమ్మ, పాముల సత్తయ్య, హరినాథ్,అఖిల్ పాల్గొన్నారు.
మోత్కూర్ : మండల కేంద్రాల్లో, గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు అనేక ఇబందులు పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీి సభ్యుడు బొల్లు యాదగిరి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. మోత్కూరు పీహెచ్ సీని 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయాలని, మోత్కూర్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, మండల కమిటీ సభ్యులు రాచకొండ కనకయ్య, దడి పెల్లి ప్రభాకర్, కొంపెల్లి ముత్తమ్మ, పానుగుల రమేష్, మామిడి కష్ణ, పిట్టల చంద్రయ్య, వడ్డేపెల్లి లక్ష్మణ్, చింతకింది సోమరాజు, కందుకూరి నర్సింహ, కొంపెల్లి గంగయ్య, దొండ నాగరాజు, బండి రవి, రాచకొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) మండలకమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు శనివారం రెండోరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు కొనసాగాయి. దీక్షలను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మండలకార్యదర్శి గంగదేవి సైదులు ప్రారంభించారు. ఈ దీక్షల్లో రాగీరు కష్ణయ్య, చీరిక సంజీవరెడ్డి, బొజ్జ బాలయ్య, మీసాల శ్రీను, గుండ్ల మహేశ్, బద్దం లింగస్వామి, చిదుగుల్ల యాదమ్మ, భీమగోని బాలరాజు, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం శ్రీకాంత్ కూర్చున్నారు. దీక్షలకు జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, నాయకులు బోయ యాదయ్య, పి.నాగరాజురెడ్డి, శంకర్‌రెడ్డి, ఎస్కె.మదార్, పల్లె శివ, కొండె శ్రీశైలం మద్ధతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన వారికి ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని, స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌చేశారు.
వలిగొండ : స్థానిక సమస్యలు పరిష్కారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రెండు రోజుల దీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 25 తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి స్వామి కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం, రామ్ చందర్ ,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, దుబ్బ లింగం, భీమయ్య, జంగయ్య ,పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.