Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తత ప్రచారం చేపట్టాలని ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో దొంతిరి సోమిరెడ్డి గార్డెన్ ఆవరణలో టీఆర్ఎస్ మండల విస్తతస్థాయి సమావేశం పార్టీ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ,బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి ,సంక్షేమ పథకాలు స్వాగతించాల్సిందిపోయి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం తధ్యమన్నారు.ఈ నెల 27న యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 15 తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభ జరపనున్నట్టు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు . ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్చైర్మెన్ వసుపరి శంకరయ్య ,మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం ,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ,మందనపల్లి గ్రామ సర్పంచ్ కోటగిరి పాండరీ గుండ్లగూడెం సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి , మహిళా విభాగం మండల, పట్టణ అధ్యక్షురాలు క్యాసగల్ల అనసూర్య, సీసా మహేశ్వరి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మొరిగాడి ఇందిర, మాజీ వైస్ ఎంపీపీ కోర్ కొప్పుల కిష్టయ్య , తదితరులు పాల్గొన్నారు.