Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్గొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ నెల 25 నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహణకు తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు,కోవిడ్ నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లు ఆయన పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం దేవరకొండ రోడ్డు లోని సంక్షేమ.పోస్ట్ మెట్రిక్ విద్యార్థినుల సంక్షేమ వసతి గహం,బి.సి.కళాశాల బాలికల వసతి గహం ఏ లను ఆయన తనిఖీ చేశారు.కోవిడ్ కారణంగా మూసి వేసిన వసతి గహాలను ప్రభుత్వ ఆదేశాల ననుసరించి తిరిగి ప్రారంభించారు. వసతి గహం లలో పారిశుధ్య పరిస్థితులు ఆయన ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ వసతి గహాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచేలా,కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అనంతరం కనగల్ మండల కేంద్రంలో కేజీబీవీ బాలికల వసతి గహం,ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థిని లు,ఉపాధ్యాయుల తో మాట్లాడారు. పారిశుధ్యం,పరిశుభ్రత కు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సల్మా భాను, జిల్లా బీసీఅభివద్ధి అధికారి కష్ణ వేణి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా ఎగ్జామి నేషన్ కమిటీ సభ్యులు ఎండి. ఇస్మాయిల్, జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి తదితరులు ఉన్నారు.