Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.శనివారం పట్టణంలో రూ.1.15 కోట్ల వ్యయంతో చేపడుతున్న నూతన కాంపౌడ్ షెడ్, ప్రహరీగోడ, డీఆర్పీసీ పనులను ఆయన శంకుస్థాపన చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుం దన్నారు.ప్రణాళికాబద్ధంగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయన్నారు.పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణపనులు కొనసాగుతున్నాయన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరందించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహ, వైస్‌చైర్మెన్ రహత్‌అలీ, రైతుబంధు మండల అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, కమిషనర్ వెంకటయ్య, నాయకులు హన్మంతు వెంకటేష్‌గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తస్లీమ్ సుల్తానా, మహ్మద్రైస్, ముడావత్ జయప్రకాష్‌నారాయణ, చిత్రపు ప్రదీప్, అశోక్, బొడ్డుగోపాల్, లింగయ్య, బొడ్డుపల్లి కృష్ణ, లియాస్ పటేల్, తౌఫిక్ఖాద్రి, ఏఈ రాజు పాల్గొన్నారు.