Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌పై నిందారోపణలు చేస్తే తగినవిధంగా బుద్ధి చెబుతామని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు,ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి హెచ్చరించారు.శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర ప్రగల్భాలు మానుకొని హుందాగా వ్యవహరించా లన్నారు.నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో విస్మరించారన్నారు.ఎప్పుడో ఒకసారి అమవాస్యకు పున్నమికి వచ్చి వెళ్లిపోయే మీకు నియోజకవర్గ ప్రజల మనస్సులో స్థానం లేదన్నారు.కాంగ్రెస్ సమావేశాలకు నాయకులే కాదు.. ప్రజలు కూడా కరువయ్యారని, ఆ విషయం తట్టుకోలేక తమ ప్రియతమ నేతపై నిందారోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మందలపు కష్ణకుమారి, వైస్‌ఎంపీపీ మల్లెలరాణి, మండల ప్రధానకార్యదర్శి శెట్టి సురేష్‌నాయుడు, మండల సమన్వయ కమిటీ సభ్యులు శంకరశెట్టి కోటేశ్వరరావు,పీఏసీఎస్ చైర్మెన్ నలజాల శ్రీనివాసరావు, సర్పంచులు పాముల మస్తాన్,యరమాల బెంజిమెన్, సాధినేని లీలాఅప్పారావు,అనుబంధ సంఘాలమండలఅధ్యక్షులు కలకొండ బాలకష్ణ, అన్నెం వెంకట్‌రెడ్డి, పత్తిపాక శ్రీను, షేక్లాల్సాహెబ్, కొళ్ళూరి వెంకటేశ్వర్లు,రమావత్ జబ్బార్, నర్సింగోజు గీత, కొప్పులకోటిరెడ్డి పాల్గొన్నారు.