Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రముఖ న్యాయవాది, ఉద్యమకారులు,బీసీ సంక్షేమ నాయకులు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా పదవీ చేపట్టిన నాతి సవిందర్ను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శనివారం సన్మానించారు.ఇటీవల ఆస్పత్రి నుండి డిశ్చార్చి అయిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ పట్టణ కమిటీ నాయకులు పరా మర్శించారు.అనంతరం సవిందర్ను చైర్పర్సన్ సన్మానించారు.ఈ కార్యక్ర మంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బుర బాల సైదులు, మాలోతు కమల చంద్రు నాయక్, వెంపటి సురేష్, నెరేళ్లమధు,పెండెం చంద్ర శేఖర్, రేణుబాబు, బొలిశెట్టి మధు, ఎల్గూరి రాంబాబు, పిడమర్తి శంకర్, సింగిరికొండ సుకుమార్ పాల్గొన్నారు.