Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
యాదగిరిగుట్టలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన వికలాంగుడు కార్తీక్గౌడ్పై లాఠీచార్జి చేసి మతికి కారకులైన టెంపుల్ పోలీసులను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి వారినీ కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై వెంటనే హోంమంత్రి డీజీపీ ఉన్నతస్థాయి అధికారితో విచారణ జరిపించాలని భారత వికలాంగులహక్కుల పరిరక్షణ సమితి రాష్ట్రఅధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు నివాసంలో కార్తీక్గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.ప్రజలకు రక్షణకవచంగా ఉండాల్సిన పోలీసులే అభంశుభం తెలియని వికలాంగులపై లాఠీచార్జి చేసి హత్యలు చేయడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం-2016ను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి ఈదయ్య బాబు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధుయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పావని పాల్గొన్నారు.