Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
ఐదు క్వింటాళ్ల పీడీఎస్బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై బత్తిని శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటరూరల్ పరిధిలోని భాషానాయక్ తండాకు చెందిన నేనావత్ చాంప్లా(34), కులము లంబాడా, వత్తి ఆటో డ్రైవర్.తన ఆటో నెంబర్ ఏపీ 36ఎక్స్ 2795లో మండలంలోని అన్నారం గ్రామస్తుల నుండి బియ్యం తక్కువధరకు కొనుగోలు చేసి సూర్యాపేట మార్కెట్లో గుర్తు తెలియని వారికి ఎక్కువ ధరకు అమ్మడానికి వెళ్తుండగా పోలీసులు పొట్లపహడ్ గ్రామ శివారులో పట్టుకున్నారు.చాంప్లాపై కేసు నమోదు చేశారు.