Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మున్సిపల్కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తేలుకుంట్ల చంద్రశేఖర్ ఆర్యవైశ్య మండలఅధ్యక్షునిగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం స్థానిక రాజశ్రీ శ్రీ కన్వెన్షన్హాల్లో జరిగిన మండల అధ్యక్ష ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానకార్యదర్శిగా తడకమళ్ళ శ్రీధర్, యు.కె కోశాధికారిగా, తాడిశెట్టి వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు.తన ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలి పారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి మనోహర్, మాజీ అధ్యక్షులు తేలుకుంట్ల జానయ్య, సముద్రాల వెంకన్న, మంచుకొండ సంజరు, కర్నాటి శ్రీని వాసులు, తాటిచెట్టు సంతోష్, గట్టురాజశేఖర్, గౌరవఅధ్యక్షులు తడకమళ్ళచంద్ర,సోమనర్సింహ పాల్గొన్నారు.