Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చింతపల్లి
పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలనుకేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కుర్మేడ్గేట్ నవోదయ మోడల్స్కూల్లో ఆదివారం పార్టీ మండల ఏడవ మహాసభ ఎమ్‌డి.సర్దార్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్న మోడీ విధానాలపై పోరాడేది ఎర్రజెండా నేనన్నారు. ప్రభుత్వసొమ్మును పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తూ మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రజలకు సేవలందించడంతో పాటు, కోట్లాది మందికి ఉఫాది కల్పిస్తున్న ఎల్ఐసీ, రైల్వే, బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తూ ఉపాధిలేకుండా చేస్తున్న మోడీ విధానాలపై ఉద్యమించాలన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం మూలంగా నిత్యావసరాల ధరలు పెరుగుదల వల్ల సామాన్య ప్రజల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల కార్పొరేట్ శక్తులకు లాభం దేశ ప్రజలందరికీ నష్టం వాటిల్లిందని, సబ్సిడీలు లేకుండా పోతాయని తెలిపారు.నూతన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసమస్యలపై ఐక్యంగా ప్రజలు పోరాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారిఅయిలయ్య, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, మండల కార్యదర్శి ఉడుగుండ్ల రాములు, మండల కమిటీ సభ్యులు యండి సర్దార్, పోలే యాదయ్య, అరెకంటి పెద్దయ్య, అస్లాంబాయి, డారి బాలయ్య,చెవిటి యాదయ్య, పోలోజు వీరబ్రహ్మం, ఉడుగుండ్ల లక్ష్మమ్మ, మాదగోని యాదయ్య పాల్గొన్నారు.