Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలంలో ఆజాదీ కా అమత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలో గోపాలపల్లి,పోతినేనిపల్లి, షాపల్లి, నక్కలపల్లి, అక్కెనపల్లి,తొండల్వాయి గ్రామాల్లో ఆదివారం గడపగడపకు తిరుగుతూ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని లీగల్ పారావాలంటీర్లు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఉచిత న్యాయసలహాలు, ఉచిత న్యాయసేవల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు అద్దంకి శ్రీశైలాచారి, మీలా కిషోర్, పులిజాలరమేష్, మహ్మద్‌అలీ, షాపల్లి సర్పంచ్ కర్నాటి ఉపేందర్, నక్కలపల్లి ఎంపీటీసీ కనుకు అంజయ్య,సింగిల్ విండో వైస్‌చైర్మెన్ జగన్మోహన్రెడ్డి ,సర్పంచ్ ఈదమాధవి, అక్కెనపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయ దాత కసిరెడ్డి సుదర్శన్‌రెడ్డి,షేక్మన్సూర్ పాల్గొన్నారు.