Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్ :మండలపరిధిలోని కాపుగల్లు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీని మండల అధ్యక్షులు అర్జున్ సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామంలోని నర్రా మాధవరావు నివాసంలో రేవూరి వెంకటాచారి అధ్యక్షతన ఆపార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహి ంచారు.గ్రామ అధ్యక్షుడిగా కాసాని రామారావు, ఉపాధ్యక్షుడిగా జిల్లా నాగేశ్వరావు, ప్రధానకార్యదర్శిగా మంకెన రామారావు, వీరేపల్లి కొండ, కోశాధికారి అమరవరపు పుల్లయ్య, సహాయకార్యదర్శిగా శ్రీను, ప్రచార కార్యదర్శులుగా గోవిందాచారి, రేవూరి వేణు, గౌరవ సలహాదారులుగా నర్రా మాధవరావు, రేవూరి వెంకటాచారి, బాలెబోయిన వెంకటేశ్వర్లు, ముత్తవరపు వీరయ్య, బాలెబోయిన గోవర్ధన్, చెరుకుపల్లి తిరుపతిరావు, జిల్లా సతీష్, కాసాని రామారావును ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.