Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించక పోవడం వల్ల రైతులు నానాఅవస్థలు, ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం ఆవేదన వ్యక్తంచేశారు.మండల కేంద్రం లోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని ధాన్యం కుప్పలను రైతు సంఘం, సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించి రైతులతో మాట్లాడారు.వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదు కోవాలని కోరారు.పదిహేను, ఇరవై రోజులుగా ధాన్యం కుప్పలు పోసి వ్యవసాయ మార్కెట్ యార్డులలో, గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలో పడిగాపులు గాస్తున్నా పట్టించు కునే వారే లేరన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్టనగేష్, అవిశెట్టిశంకరయ్య, రైతుసంఘం జిల్లా నాయకులు ఐతరాజు నర్సింహ, మండలనాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలారాజయ్య, రైతునాయకులు చొప్పరిమల్లేశం, నిమ్మనగోటిలక్ష్మయ్య,అక్కెనపల్లి నాగయ్య, రాసమల్ల భిక్షం, సంగి అయిలయ్య, ఆగు కేతమ్మ, పద్మ, మహేశ్వరి, తుమ్మల సులోచన, ఎల్లమ్మ పాల్గొన్నారు.