Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి రూరల్
మండలంలోని కునూరు గ్రామానికి చెందిన బూసి గంపల మన్నేమ్మ - చంద్రయ్యల మేనకోడలు శైలజ వివాహం ఆదివారం యాదాద్రి ఫంక్షన్ హాల్లో జరిగింది. వివాహానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరై రూ.50,116 ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జనగాం పాండు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, సర్పంచ్ అంకర్ల మురళి, యువజన విభాగం అధ్యక్షుడు ఎం.నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు చిలువేరు మధు, గ్రామ శాఖ అధ్యక్షులు పాశం మహేష్, తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యకల శ్రీనివాస్, నాయకులు తుమ్మల వినోద్, గుండ్ల భానుప్రసాద్, భతిని సాయి కుమార్ పాల్గొన్నారు.