Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
నేటి నుంచి జరగబోయే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్పందన జునియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చీఫ్ సూపరింటెండెంట్లు లింగం, సత్యనారాయణరెడ్డి తెలిపారు. స్పందన కళాశాలలో 192 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 209 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు. స్పందన కళాశాలలో 14 మంది అధ్యాపకులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. డీఈసీ సభ్యులు లక్ష్మయ్య ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమలగిరిరూరల్:నేటి నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం మండలంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతారంలోని ఆదర్శ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల, తిరుమల సహకార జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆదర్శ పాఠశాలలో 185 మంది, రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో 190 మంది, తిరుమల సహకార జూనియర్ కళాశాలలో 174 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు.