Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ జుడిషియల్ ఫాస్ట్రాక్ మెజిస్ట్రేట్ దుర్గారాణి తులసి
నవతెలంగాణ-వలిగొండ
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అడిషనల్ జుడిషియల్ ఫాస్ట్రాక్ మెజిస్ట్రేట్ కలిదిండి దుర్గారాణి తులసి తెలిపారు. ఆదివారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. భూతగాదాలు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు వివిధ రకాల అంశాలపై ఉచిత న్యాయం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీఐ మోతి రామ్, ఎంపీపీ నూతి రమేష్, తహసీల్దార్ నాగలక్ష్మి, సర్పంచ్ బోలా లలిత, న్యాయవాదులు ఎమ్‌డి.మజీద్, కొండూరు బాలరాజు, మామిడి వెంకట్‌రెడ్డి, డేవిడ్, ఎస్సై రాఘవేంద్రగౌడ్, ఉప సర్పంచ్ మత్స్యగిరి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ, ఎంపీవో ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.