Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవేక్షించని ఇంజినీరింగ్ అధికారులు
నవతెలంగాణ - సంస్థాన్ నారాయణపురం
మండల కేంద్రంలోని ఊరు చెరువు అలుగు నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరి ంచారు. చెరువులో ఉండాల్సిన నీటి సామర్ధ్యం ప్రకారం గతంలో ఇంజినీరింగ్ అధికారులు ఆలుగు నిర్మించారు. అలుగు నీటి పారుదలకు అడ్డంగా పంచాయతీరాజ్ శాఖ నిధులతో మెటల్‌రోడ్డు వేశారు. చెరువు అలుగు నీళ్లు పోయేందుకు సిమెంట్ గూనలు నిర్మించారు. ఈ గునలను అలుగుకు సమాన ఎత్తులో నిర్మించాల్సి ఉంది. కానీ ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోక పోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా అలుగు కంటే ఎత్తులో నిర్మించారు. దీంతో చెరువులో సామర్థ్యానికి మించి నీళ్లు చేరుతున్నాయి. పంట పొలాలు మునిగి పోవడమే కాకుండా చెరువు తెగి పోయే ప్రమాదం ఉందని చెరువు కింది ఉన్న పొలాల రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి బాధ్యులపై కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.