Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కోరారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యంగా కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు. పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టేనని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా దొంగరి గోవర్ధన్‌ను, ఉపాధ్యక్షులుగా మారగాని వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, అన్నారం గ్రామ సర్పంచ్ మిట్టగడుపుల అనోక్, రుద్ర రామచంద్రు, శ్రీనివాస్‌రెడ్డి, పంజాల ప్రభాకర్, పెద్దబోయిన అజరుకుమార్, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ నాయకులు కొండ నాగరాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొమ్ము జోహార్, కుంచాల ప్రవీణ్‌రెడ్డి, వీరబోయిన రమేష్, వెలిశాల శేఖర్, గుర్రం రమేష్, పొన్నాల సృజన్, పోగుల చంద్రశేఖర్ రెడ్డి, బింగి అనిల్, శ్రీకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.