Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కేంద్రంగా విస్తరిస్తోందని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. ఆదివారం స్థానిక 45వ వార్డులో ఫ్యాషనిక్ హెయిర్ అండ్ టాటూ స్టూడియోను ప్రారంభించి మాట్లాడారు. మంత్రి జగదీష్‌రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనేక వ్యాపార సంస్ధలు తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. విద్యానగర్‌లో ప్రయివేటు సంస్థలు, ఆస్పత్రులు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ నాయకులు బీరవోలు శ్రీహర్ష, మిరియాల కృష్ణమూర్తి, చల్లా సత్యనారాయణ, వుల్లి రామాచారి, రాచకొండ శ్రీనివాస్, రాచకొండ వేణు, సంగు నవీన్, జూలకంటి నాగరాజు, తేరట్పల్లి సతీష్, సోమ మురళి, బెజగం ఫణి, బజ్జురి శ్రీనివాస్, యాద కిరణ్, ఉప్పల రాజు, కస్తూరి నవీన్, గుండా లక్ష్మయ్య, గొల్ల కిరణ్ పాల్గొన్నారు.