Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ నిర్వహణకు విరివిగా విరాళాలివ్వండి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో భూదాన్ పోచంపల్లిలో నిర్వహించనున్న యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) ద్వితీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ తెలిపారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో మహాసభల బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. మూడు రోజుల పాటు భూదాన్ పోచంపల్లిలో మహాసభలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా 5వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు కేంద్ర నాయకత్వం హాజరు కానున్నట్టు చెప్పారు. మహాసభలను పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకూ నెలరోజులపాటు తమ పార్టీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో గడపగడపకూ తిరిగి సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు ఉద్యమ నిర్వహణకు ప్రజా విరాళాలు సేకరిస్తారన్నారు. ప్రజలందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. జిల్లా అభివృద్ధికి మూలాధారమైన సాగునీటి సమస్య అపరిష్కతంగానే ఉందన్నారు. మూసీ ఆధారిత కాలువల ద్వారా కొన్ని మండలాల్లో మాత్రమే సాగునీరు అందుతుందని, సగానికిపైగా మండలాలకు సాగునీటి వసతి లేద న్నారు. నృసింహాసాగర్ (బస్వాపురం జలాశయం) 11.3 9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టి రెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామని అనేక గడువులు పెట్టిన ప్రభుత్వం నిధుల కొరతతో నేటికీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. ఆలేరు ప్రాంతానికి నీరందించే గంధమల్ల రిజర్వాయర్ పనులకు అతీగతీ లేదని, సంస్థాన్ నారాయణపురం మండలా నికి సాగునీటి ప్రతిపాదనల్లో స్పష్టత లేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న ధర్మారెడ్డికాల్వ పూర్తి చేయడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహా, ఎం.యాదయ్య, ప్రజా సంఘాల నాయకులు బండారు నర్సింహా, ఎస్కె.లతీఫ్, వడ్డెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.