Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ - రామన్నపేట
సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, పేద ప్రజల స్థితిగతులను మార్చేం దుకు యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. యువత భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పని చేయాలని కోరారు. దేశంలో దేశభక్తి ముసుగులో యువతరాన్ని పక్క దారి పట్టిస్తూ బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తున్న దని విమర్శించారు.బీజేపీ నాయకులు మహాత్ముడిని చంపిన గాడ్సేను దేవుడిగా చిత్రీకరిస్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చేం దుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. యువత కులో న్మాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయ ని విమర్శించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా, ఏటా లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచిపోషిస్తున్నాయన్నారు. విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు రాజలింగం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్, మాజీ డీవైఎఫ్ఐ నాయకులు కూరేళ్ల నరసింహా చారి,డీివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, స్థానిక ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మనర్సింహా, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు మెట్టు శ్రవణ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఆవనగంటి హరీశ్, చెన్నోజు వినరు, బండ్ల పవణ్, గుర్రం మహేష్, ఆవనగంటి మల్లేష్, జ్యోతీబసు, తాటిపా ముల ఉదరు, తాటిపాముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.