Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడుచర్ల:వానాకాలం వరి పంట చేతికొచ్చిన వేళ వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధీరావత్ రవినాయక్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొదమగుండ్ల నగేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని అరవింద్ భవన్లో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ఆసియాలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి కేంద్రానికి ఈ ప్రాంతం కేరాఫ్ అని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ పంటలపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పించి వాటికి మార్కెటింగ్, మద్దతు ధరను ప్రభుత్వమే ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, సభ్యులు చలసాని అప్పారావు, బుడిగె ధనుంజయ, మామిడి నాగసైదులు, పాలకూరి రాములమ్మ, మర్రి నాగేశ్వర్రావు, అల్వాల శ్రీధర్, రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.