Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:సూర్యాపేట పట్టణ కేంద్రానికి చెందిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హార్మోనిస్టు పానుగంటి చంద్రశేఖర్ పంతులు (66) సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. చంద్రశేఖర్ పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది నాటకాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన హార్మోనియంతో ప్రేక్షకులను మెప్పించి నూతన ప్రదర్శకులను తయారు చేసి వేలాది ప్రదర్శన ఇప్పించారు. వీరి సంగీత సారధ్యంలో అనేక నంది, గరుడ, హనుమ, నటరాజ, అశ్వం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అజోవిభో అవార్డులు వచ్చాయి. పద్యాలు, నూతన రాగాలతో నూతన పద్ధతిలో ట్యూనింగ్ చేయడంలో వీరికి వీరే సాటి. పంతులు భౌతిక కాయాన్ని తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు తడకమళ్ల రాంచందర్రావు, మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు జి.పుల్లయ్య, రాధాకృష్ణ, విజయభాను, కళా సమితి సభ్యులు సందర్శించి నివాళులర్పించారు.