Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలో బీజేపీ కార్యాలయం లో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండా భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా కర్నాటి వజ్ర కుమార్ను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంకూరి నర్సింహా, జిల్లా కార్యదర్శి గోపీనాథ్, పట్టణాధ్యక్షులు గుండాల అంజయ్య, వివిధ మోర్చా జిల్లా నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.